ఈమధ్య సెలబ్రిటీలు ఏదైనా హిట్ అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. స్టార్ హీరోలు సైతం తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. ఇక తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి దూసుకుపోతుంది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించింది చిత్రయూనిట్. ఈసినిమా కూడా మౌత్ టాక్ తోనే మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా సక్సెస్ పై మాస్ మహారాజా రవితేజ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించారు. బేబి సినిమాను చూశాను.. చాలా బాగుంది.. టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో ఈసినిమాను చాలా అద్భుతంగా రూపొందించాడు డైరెక్టర్ సాయి రాజేష్. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగుంది. ఈసినిమాను నిర్మించిన ఎస్.కే.ఎన్ కు బిగ్ కంగ్రాచ్యూలేషన్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Loved watching #Baby, Brilliantly conceived & presented by @sairazesh with great support by the technical team especially @VijaiBulganin’s music was too good 😊👍🏻
Top notch performances by the talented young trio @ananddeverkonda @iamvaishnavi04 @viraj_ashwin 👍🏻👌🏽
Big…
— Ravi Teja (@RaviTeja_offl) July 17, 2023
కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























