అముద శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా వస్తున్న సినమా ‘నా.. నీ ప్రేమ కథ’. ప్రేమకథగా రాబోతున్న ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ట్రైలర్ అద్భుతంగా ఉంది. హీరోగా దర్శకునిగా అముద శ్రీనివాస్ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. నటీనటులు అంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రం నిర్మాత పోత్నాక్ శ్రవణ్ మంచి లాభాలు రావాలి. హీరో దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలని చిత్ర యూనిట్ అభినందనలు తెలిపారు.
A Raw, Rustic & Romantic love story #NaaNeePremakatha 🫶❤️ Trailer out now on @TeluguFilmNagar ▶️ https://t.co/6EP8M2ge6x#Nivas #KaarunyaChowdary #MLPRaja #PurnaChary #AmudhaSrinivas #PothnakSravanKumar #PothnakSravanKumarEntertainments @MangoMusicLabel #TeluguFilmNagar pic.twitter.com/vQE6yj695y
— Telugu FilmNagar (@telugufilmnagar) July 15, 2023
కాగా ఈసినిమాలో కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించింది. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఎంఎల్ పి రాజా సంగీతం అందిస్తుండగా.. చిన్నా నేపధ్య సంగీతం.. ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: