
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 80


బ్రో సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే

మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్?

బ్రో ట్రైలర్ అప్డేట్

ప్రేమ్ కుమార్ ట్రైలర్ రిలీజ్

బ్రో బీజియం లాస్ట్ డే వర్కింగ్

ప్రాజెక్ట్ కే కోసం ల్యాండ్ అయిన సలార్

దేవర షూటింగ్ అప్డేట్

బ్రేక్ తీసుకోనున్న సుప్రీమ్ హీరో

బెస్ట్ కల్ట్ మూవీ?

రియలిస్టిక్ లొకేషన్స్ లో సెల్ఫిష్

సితార చేతికి లియో
వారసుడు తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం లియో.రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.కేవలం 120రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

బెదురులంక 2012- సొల్లుడా శివ ఫుల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

బ్రో సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.ఈనెల 28న థియేటర్లలోకి రానుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని అంచనాలు పెంచేశాయి.ఇక ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.ఈసినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసింది.అంతేకాదు బోర్డు సభ్యులు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారని సమాచారం.ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.కేవలం 2గంటల16నిమిషాల నిడివితో బ్రో ప్రేక్షకులముందుకు రానుంది.

మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్?
రిలీజ్ కు ముందు ప్రతి సినిమాకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పుడు ఈ ప్రమోషన్స్ ఒక సినిమా గురించి ప్రేక్షకులు తెలియడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు సినిమా మొదలు నుండి రిలీజ్ అయ్యే వరకూ కొత్త కొత్త క్రియేటివిటీతో వస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో కూడా పోటీ వాతావరణం ఎక్కువైంది. ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వస్తే అంత తోపు అన్నట్టుగా తయారైంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఇవన్నీ మినహాయింపే. ఎంత పోటీ ఉన్నా ఎవరి రికార్డులు వారికే ఉంటాయి. వారి సినిమాల ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు.

బ్రో ట్రైలర్ అప్డేట్
మచ్ అవైటెడ్ బ్రో సినిమా మరో 9రోజుల్లో థియేటర్లోకి రానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది చిత్ర బృందం.అందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఇక ఈ సినిమా ట్రైలర్ గురించి నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ స్పందించారు.ట్రైలర్ విడుదల ఈనెల 21కి అనుకుంటున్నాం ఒకవేళ విఎఫ్ఎక్స్ ఆలస్యం అయితే తరువాతి రోజున విడుదలచేస్తామని అన్నారు.సో బ్రో ట్రైలర్ 21న లేదా 22న విడుదలకానుంది.

బ్రో టికెట్ ధరలపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా స్క్రిప్ట్ లో పలు మాార్పులు కూడా చేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

ప్రాజెక్ట్ కే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రాజెక్ట్ కే. నిజానికి ఈసినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలల వరకూ టైముంది. కానీ ఇప్పటినుండే ఎదురుచూపులు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ అశ్విన్ మేకింగ్.. అందులోనూ ప్రభాస్ హీరో కాబట్టి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వినూత్నంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే యూనిట్ హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో…

ప్రేమ్ కుమార్ ట్రైలర్ రిలీజ్
గోల్కొండ స్కూల్ సినిమాలో బాలనటుడిగా నటించి పేపర్ బాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇక అప్పటినుండీ హీరోగా తనను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సంతోష్ శోభన్. నిజానికి సంతోష్ శోభన్ ఎన్ని సినిమాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఆమధ్య ఏక్ మినీ కథ సినిమాతో ఒక హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మరోకథతో వస్తున్నాడు.

బేబిపై సుకుమార్ ప్రశంసలు- ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లర్
సాయి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. యూత్ ఫుల్ ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈనెల 14వ తేదీన రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కథ, నటీనటుల పెర్ఫామెన్స్, సంగీతం అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో అందరికీ నచ్చడంతో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక ఈసినిమాపై సెలబ్రిటీలు కూడా ఒక్కొొక్కరూ తమ సోషల్ మీడియా స్పందిస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ఈసినిమాపై ప్రశంసలు కురిపించగా ఇప్పుడు మరో క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఈసినిమాపై ప్రశంసల వర్షం…

బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది
బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఆరు సీజన్లు జరగగా త్వరలో సీజన్ 7 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు షో యాజమాన్యం. ప్రోమోతోనే సీజన్ పై క్యూరియాసిటీని పెంచేశారు. నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని ఈసారి సీజన్ లో అంటూ ఆగిపోతాడు.. మళ్లీ ఈసారి కొత్తగా అని చెబుతూ.. ప్రతిసారి ఇదే అంటూ అంటూ ఆగిపోయి. ఫైనల్ గా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ ఈసారి కొత్తగా…

బ్రో బీజియం లాస్ట్ డే వర్కింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అందరూ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా జులై28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది.

ప్రాజెక్ట్ కే కోసం ల్యాండ్ అయిన సలార్
టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

దేవర షూటింగ్ అప్డేట్
యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు.తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు.రాబోయే షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట.

బ్రేక్ తీసుకోనున్న సుప్రీమ్ హీరో
రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తనకున్న అనారోగ్య కారణాల వల్ల ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకోనుంది. ఇప్పుడు మరో హీరో కూడా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నాడు. ఆహీరో ఎవరో కాదు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని తన సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రీసెంట్ గానే విరూపాక్ష సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అంతేకాదు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో…

జెంటిల్‌మెన్ 2- గ్రాండ్ గా ప్రారంభం కానున్న కంపోజింగ్
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు.

బెస్ట్ కల్ట్ మూవీ?
ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం మారిపోయినప్పటి నుండి ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టమయిపోయింది. ఒక్కోసారి ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా కూడా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది రుజువైంది. రీసెంట్ రిలీజ్ అయిన బేబీ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో చూస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని షాకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

మామన్నన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో తమిల్ వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రజాదారణ పొందిందే. ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

రిలీజ్ ముందే సలార్ రికార్డ్ - నెవర్ బిఫోర్ రిలీజ్
పాన్ ఇండియాా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం సినిమాా జయాపజయాలకు అతీతంగా రోజు రోజుకూ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ అయితే ఇంకా షూటింగ్ దశలోనే అయితే ప్రాజెక్ట్ కే రిలీజ్ కు ఆరు నెలలు ముందుగానే ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టేసింది. అ సంగతి పక్కన పెడితే ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

రియలిస్టిక్ లొకేషన్స్ లో సెల్ఫిష్
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

ప్రాజెక్ట్ కే నుండి దీపికా ఫస్ట్ లుక్ రిలీజ్
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్,రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే.వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.సుమారు 500కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్,దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.