ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగులో మాత్రం హీరోలు ఫుల్ మాస్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడైతే హీరో ఇలానే ఉండాలి అన్న సట్రంలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారటం.. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త డైరెక్టర్లు వస్తుండటంతో హీరోలు కూాడా తమ పంథాను మార్చుకున్నారు. ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు డీ గ్లామర్ పాత్రల్లో ఫుల్ ఊరమాస్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికితోడు ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుండటంతో స్టార్ హీరోల దగ్గర నుండి ఇప్పుడు యంగ్ హీరోల వరకూ అందరూ మాస్ అవతారం ఎత్తుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా రంగస్థలంలో రామ్ చరణ్ తన మాస్ లుక్ లో అలరించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చాలామంది హీరోలకు ఇన్ఫిరేషన్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో రామ్ తనలోని ఊరమాస్ యాంగిల్ ను బయటపెట్టాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు సీక్వెల్ కూడా తీస్తున్నారు. ఇక అదే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డీగ్లామర్ పాత్రలో ఊరమాస్ ఆవతారం ఎలా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈసినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. ఇక నాని కూడా ఇన్ని రోజులు కాస్త క్లాస్ పాత్రలో నటించినా దసరా సినిమాతో ఊరమాస్ పాత్రలో ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఈసినిమా నాని కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తెలియని మాస్ కాదు.. అయితే సెకండ్ ఇన్నింగ్స్ తరువాత రీమేక్ లు ఎక్కువగా చేస్తున్న చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నటించి హిట్ కొట్టాడు.
ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో సైతం ఊరమాస్ పాత్రల ద్వార ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు హీరోలు. ముందుగా మహేష్ గుంటూరు కారం సినిమాలో మొదటి సారిగా ఇంత మాస్ పాత్రలో నటిస్తున్నాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్ కూడా మాస్ పాత్రలో నటించబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ అలానే తాజాగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ ను చూస్తే విశ్వక్ కూడా ఊర మాస్ పాత్రలో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇంకా పలు హీరోలు కూడా లైన్ లో ఉన్నారు. మొత్తానికి ప్రస్తుత ట్రెండ్ ను మన హీరోలు మంచిగా వాడుకుంటూ హిట్లు కొట్టడానికి రెడీ అయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: