బెదురులంక 2012- దొంగోడే దొరగాడు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

bedurulanka 2012 third single release date fixed

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా తరువాత కార్తికేయ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు కానీ మొదటి సినిమా తరువాత ఆరేంజ్ హిట్ ను ఇంతవరకూ అందుకోలేకపోయాాడు. ప్రస్తుతం అయితే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 25వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే వెన్నెల్లో ఆడపిల్ల అనే ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ సొల్లుడా శివ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. దొంగోడే దొరగాడు అంటూ వచ్చే మూడో పాటను ఆగష్ట్ 3వ తేదీన 9 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.