పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మేనియా అప్పుడే మొదలైపోయింది. గతకొంతకాలంగా ఆదిపురుష్ కోసం వెయిట్ చేయగా ఆసినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి సెప్టెంబర్ 28 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా అప్పుడే సలార్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో నేషనల్ వైడ్ గా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్ గా రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది. మరో అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ రానున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను ఆగష్ట్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమైనట్టు తెలుస్తుంది. ఆ తరువాత వరుసగా పాటలను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. చూద్దాం మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇస్తారేమో..
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























