తెలుగు ప్రేక్షకులకు తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు. ఇక ఆతరువాత ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈమధ్య పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే జపాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తీ. రాజు మురుగన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కార్తీ హీరోగా గతంలో సర్దార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వాటర్ మాఫియా, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు త్రాగడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, తాగు నీటి విలువ గురించి ఈసినిమాలో చూపించగా.. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమా గురంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమా ఈసినిమాను ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇక సర్దార్ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందించగా.. సర్దార్ 2 కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నటించే నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: