సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ బ్రో. ఈసినిమా వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంది. కాలం ఎంత విలువైందో చెబుతూ మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో దానికి తోడు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా ఏ రేంజ్ లో వస్తున్నాయో చూస్తున్నాం. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిందంటేనే అర్థం చేసుకోవచ్చు. పవన్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాతంగా రిలీజ్ అయినా రిలీజ్ తరువాత మాత్రం కాస్త రాజకీయ వివాదలు అలుముకున్నాయి. అందులోనూ పవన్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు కావడంతో ఇంకా ఎక్కువ రచ్చ మొదలైంది. ఈనేపథ్యంలోనే ఇతర పార్టీ రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈసినిమా గురించి, పవన్ రెమ్యునరేషన్ గురించి, కలెక్షన్స్ గురించి పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వీటిపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందిస్తూ సాలిడ్ రిప్లై ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వప్రసాద్.. బ్రో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.. మాకు లాభాలే కానీ ఈసినిమా వల్ల వచ్చిన నష్టాలు ఏం లేవు. సినిమా కలెక్షన్స్ లెక్కలు కానీ, పవన్ రెమ్యునరేషన్ గురించికానీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. అవి మా ఒప్పందం ప్రకారం ఉంటాయి. ట్యాక్స్ అధికారులకు, ఏజెన్సీకి మాత్రమే చెబుతాం మూడో వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: