ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్రో హౌస్ ఫుల్

BRO Movie Entertaining Family Audience At Its Best

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్రో సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎక్స్ పెక్ట్ చేసినట్టే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కటౌట్ ఉంటే చాలు అన్నంత రేంజ్ లో ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాడు పవన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తమ అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు. కానీ ఏ సినిమా అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇప్పుడు బ్రో సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అదే రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు.. తన పని తను చేసుకుంటూ వెళుతూనే ఉంటుంది.. అలానే మనిషి కూడా చిత్తశుద్దితో తన పని చేసుకుంటూ వెళ్లాలన్న మెసేజ్ ను ఈసినిమా ద్వారా ఇచ్చారు. అంతేకాదు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండి ఆడియన్స్ కంటతడి సైతం పెట్టిస్తున్నాయి. అందుకే ఈసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది.
ఈనేపథ్యంలోనే రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్నా కూాడా ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్ లతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం అంటే మాములు విషయం కాదు.

ఈసినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పవర్ స్టార్ ఎనర్జిటిక్ యాక్టింగ్ సాయి ధరమ్ తేజ్ ను టీజ్ చేసే సన్నివేశాలు, ఇంకా తన పాత పాటలకు మళ్లీ డ్యాన్స్ చేయడం హైలెట్ గా నిలిచాయి. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన భావోద్వేగమైన డైలాగ్స్ తోనే మనిషిని ఆలోచింపచేసే సత్తా ఉన్న రైటర్. ఈసినిమాలో కూడా అలాంటివి ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. థమన్ మ్యూజిక్ వేరే లెవల్. అన్ని ఎలిమెంట్స్ కలిసి ఈసినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.