టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ రెడ్, వారియర్ లాంటి సినిమాల్లో కనిపించినా అవి పెద్దగా విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు పాటలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసినిమా ఫస్ట్ సాంగ్ నీ చుట్టూ చుట్టూ అంటూ వచ్చే పాటను ఆగష్ట్ 3వ తేదీన ఉదయం 9గంటల 36 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక చూడబోతే ఈపాటలో రామ్ ఇంకా శ్రీలీల తమ కిల్లింగ్ స్టెప్పులతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తున్నారు. రామ్ సూపర్ డ్యాన్సర్.. అలానే శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్ మరి ఈసాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రోమోనే ఇలా ఉంటే పాట ఎలా ఉంటుందో.. అది చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: