ఈఏడాది ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈసినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ భారీ సెట్ లో భారీ సాంగ్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల తోపాటు ప్రధాన తారాగణంపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈపాటలో.. ప్రధాన తారాగణం అంతా కనిపించబోతుండటంతో.. బిగ్ స్క్రీన్స్ పై ఈపాట విజువల్ వండర్ గా ఉంటుందని అంటున్నారు.
A mesmerising number from #BhagavanthKesari is currently being shot on a grand scale at a hugely erected set in RFC 🔥
This is going to be an eye feast on the big screens from October 19💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman…
— Shine Screens (@Shine_Screens) July 31, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: