చంద్రముఖి2 నుండి లారెన్స్ రాయల్ లుక్ రిలీజ్

raghava lawrence first look out from chandramukhi 2 movie

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడు అయిన లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన లారెన్స్ అనంతరం హీరోగా పలు చేశాడు. అలానే డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేశాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సూపర్ హిట్ హార్రర్ సినిమా సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఈసినిమాలో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వినాయక చవితికి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న లారెన్స్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాయల్ లుక్ లో ఉన్న లారెన్స్ పోస్టర్ ఆక్టటుకుంటుంది.

కాగా ఈసినిమాలో కంగనా రనౌత్, వడివేలు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 3 =