స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇండస్ట్రీలో దాదాపు శబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత . నిజానికి కెరీర్ సాఫీగా సాగుతున్నప్పుడు హీరోయిన్స్ ఏమాత్రం బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉండరు. కానీ సామ్ మాత్రం అందుకు విరుద్దం. తను ఏం చేయాలను కుంటుందో అదే చేసే అలవాటు ముందు నుండీ సామ్ కు ఉంది. అందుకే ప్రస్తుతం బిజీగా ఉన్నా కూడా ఒక ఏడాది పాటు షూటింగ్ లకు బ్రేక్ చెప్పేసింది. ఇక ఈ బ్రేక్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తను చేసిన పోస్ట్ లను బట్టి చెప్పొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత ప్రస్తుతం బాలిలో తన ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. తమ ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లిన సామ్ తన ఇన్ట్సా ద్వారా ఫొటోలను వీడియోను షేర్ చేసుకుంటూనే ఉంది. తాజాాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసింది సామ్. మరి వాటిని చూస్తుంటే సామ్ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తుందన్న విషయం అర్థమవుతుంది.
View this post on Instagram
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇంకా సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా రీసెంట్ గా పూర్తి చేసుకుంది సమంత.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: