పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే పాయింట్ అదే అయినా కూడా ఇక్కడ ప్రేక్షకులకు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేశారు. అలా రిలీజ్ కు ముందు నుండ్ అప్డేట్లతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈసినిమా కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటన, పవన్-తేజ్ ల కాంబినేషన్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకోవడంతో మంది ఆదరణతో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ విజయోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుండి బ్రో విజయోత్సవ యాత్ర మొదలుపెట్టనున్నట్టు చెప్పిన నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తో పాటు చిత్రబృందం విజయవాడ వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్రయూనిట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. తెనాలి, గుంటూరు లో కూడా ప్రర్యటించనున్నారు.
Mega fans welcomed Supreme Hero @IamSaiDharamTej with a Massive Bike Rally during #BroVijayaYatra in Guntur 🤩💥#BlockbusterBRO ~ Book Your Tickets Here 🎫 : https://t.co/QInCQSFvEw#BROTheAvatar @PawanKalyan @thondankani @TheKetikaSharma @MusicThaman @vishwaprasadtg… pic.twitter.com/gJuN5Fv1mD
— People Media Factory (@peoplemediafcy) August 1, 2023
కాగా సముద్రఖని దర్శకత్వం వహించిన ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు థమన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























