యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది.అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగానే శ్రమిస్తోంది.అందులోభాగంగా పెద్దగా గ్యాప్ తీసుకుకోండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.ఇక కొద్ది రోజుల గ్యాప్ తరువాత కొత్త షెడ్యూల్ ఈరోజు శంషాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.ఈషెడ్యూల్ లోకూడా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ సొలొమాన్ ఈ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో,కలైరాసన్ తదితరుల ఫై ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు. వచ్చే నెల 7వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దేవర వచ్చే ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్య తెలుగుతోపాటు హిందీ,తమిళ ,కన్నడ,మళయాళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























