ఆగష్ట్ లో సినిమా రిలీజ్ ల సందడి

Telugu Movies Releasing In August Month

సినీ లవర్స్ కు ప్రతి శుక్రవారం పండగ లాంటిదే. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సీజన్ అయితే ఒక్కోసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సమ్మర్ లో పలు సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వగా.. జూన్, జులై లో ఆ జోరు కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు ఆగష్ట్ నెల మాత్రం మంత్ మొదలు నుండి చివరి వరకూ వరుస రిలీజ్ లతో సందడి కానుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ ఈ ఒక్క నెలలోనే చాలాా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా ఈ నెలలో సందడి చేయడానికి సిద్దంగా ఉన్నసినిమా మహేష్ బిజినెస్ మేన్. ఈసినిమా ఆగష్ట్ 9వ తేదీన రీరిలీజ్ అవుతుంది..

ఆగష్ట్ 10.. ఇక ఆగష్ట్ 10వ తేదీన సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమా జైలర్ రిలీజ్ కాబోతుంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆగష్ట్11.. ఆగష్ట్ 10 తేదీన తలైవా సందడి చేసిన వెంటనే ఆగష్ట్ 11వ తేదీన మెగాస్టార్ వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్ సినిమా ఆగష్ట్ 11వతేదీన రిలీజ్ కానుంది.

ఆగష్ట్ 12.. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ఆగష్ట్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆగష్ట్ 18.. ఇక ఆగష్ట్ 18 ఒక్కరోజునే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా ప్రేమ్ కుమార్. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఆగష్ట్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే రోజున మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా కూడా రిలీజ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఈసినిమా వస్తుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా కూడా ఆగష్ట్18 వ తేదీన రిలీజ్ కానుంది. పెదకాపు సినిమా కూడా ఇదే రోజున రిలీజ్ అవుతుంది. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా కూడా ఆగష్ట్ 18వ తేదీన రిలీజ్ అవుతుంది.

ఆగష్ట్ 25.. మరోవైపు ఆగష్ట్ 25వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇంకా కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. ఈ సినిమా కూడా ఆగష్ట్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

మరి ఇన్ని సినిమాలో ఎన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొడతాయి.. ఎన్ని సినిమాలు బోల్తా కొడతాయి అన్నది చూడాలంటే రిలీజ్ ల వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =