సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?

star hero dulquer salmaan in suriyas new film

డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో.. విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనితోపాటు సూర్య సుధా కొంగర దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో ఆకాశం నీ హద్దురా సినిమా రాగా అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =