కృతి ఎమోషనల్ పోస్ట్.. అవే ఈరోజు ఈస్థానంలో ఉంచాయి

ఉప్పెన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది కృతిశెట్టి. ఇక ఆసినిమా తరువాత వరుస ఆఫర్లు అందుకొని అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక నేేడు కృతిశెట్టి పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె సినిమాల నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తన పుట్టినరోజుకు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేసింది కృతి శెట్టి. మరో ఏడాదిలోకి అడుగుపెట్టేశాను. నేను చాలా కృతజ్ఞురాలిని..సంతోషం, ప్రేమ, బాధ, ధ్వేషం ఇలా ఎన్నో అనుభవాలను ఎక్స్ పీరియన్స్ చేశాను. అవన్నీ ఈరోజు నన్న ఈస్థానంలో ఉంచాయి.. నాలో స్పూర్తి నింపుతున్న నా కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. వారితో పాటు తన ప్రతి అడుగులో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Shared post on

Embed Instagram Post Code Generator

ఇక కృతిశెట్టి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి ప్రస్తుతం శర్వానంద్ 35 సినిమాలో నటిస్తుంది. ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా మలయాళంలో టొవినో థామస్ హీరోగా వస్తున్న ఏఆర్ఎమ్ సినిమాలో నటిస్తుంది. ఇంకా తమిళ్ కూడా సినిమాలు చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 8 =