అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా స్కంద. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నాడు బోయపాటి. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడింది. ఇక రిలీజ్ కు డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ను తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. నైజాం హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలింస్.. సీడెడ్ హక్కులను ఎస్ఆర్ఆర్ ఫిలింస్.. ఈస్ట్ గోదావరి హక్కులను శ్రీ లాస్య ఫిలింస్.. వెస్ట్ గోదావరి హక్కులను మహిక మూవీస్.. కృష్ణ హక్కులను జీ3.. గుంటూరు హక్కులను వీ ఎంటర్ టైన్ మెంట్స్.. నెల్లూరు హక్కులను అంజలి పిక్చర్స్చ్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
Here is the AP & TS Distributors List of #Skanda!
Get Ready to Witness Massive Energetic Combo Rage in a Never Before way ❤️ #RAPOMass #SkandaOnSep28
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake… pic.twitter.com/y65GdqAQtM
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 21, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: