అమెరికాలో ఇంకా తగ్గని ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్

RRR to be Screening This Week in Theaters at Selected Locations Across The US

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్ ఛాయిస్‌, హెచ్‌సీఏ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు, 69వ ఇండియన్ నేషనల్ అవార్డ్ సహా మరికొన్నింటిని ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అజయ్ దేవగన్, అలియా భట్ వంటి బాలీవుడ్ తారలు ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా అనేక దేశాల్లో విశేషంగా అలరించింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పుకోవాలి. అక్కడ సాధారణ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాను, దర్శకుడు రాజమౌళిని కొనియాడారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం ఈ సినిమాను చూసి రాజమౌళిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇప్పటికీ కొందరు అమెరికన్స్ ఈ సినిమాను ఓటీటీలో చూస్తూ సోషల్ మీడియాలో రివ్యూలను ఇస్తుండటం గమనార్హం.

ఈ క్రమంలో తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరోసారి అమెరికాలో రిలీజ్ కాబోతోంది. నేటినుంచి ఒక వారం రోజులపాటు.. అనగా సెప్టెంబర్ 22 – సెప్టెంబర్ 29 వరకు ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 24 న అతిపెద్ద పారిస్ థియేటర్ ఎన్‌వైసీలో స్పెషల్ షో వేయనున్నారు. ఇక ఈ సినిమా టికెట్లను https://landmarktheatres.com/movies/304555-rrr-encorrre/ ద్వారా పొందవచ్చు అని కూడా సూచించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు బిగ్ స్క్రీన్స్ పై ఈ సినిమాను వీక్షించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =