కృతి పాన్ ఇండియా ARM మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్

కరోనా వల్ల మలయాళం సినిమాలంటే సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకే అక్కడి మేకర్స్ కూడా తమ సినిమాలకు ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఈమధ్య కాలంలో తన సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో టొవినో థామస్. మిన్నన్ మురళీ, రీసెంట్ గా వచ్చిన 2018 సినిమాలతో తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. జితిన్‌ లాల్ దర్శకత్వంలో టొవినో థామస్ హీరోగా వస్తున్న సినిమా ఏఆర్ఎమ్ (అజయంతే రందమ్ మోషనమ్). ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అజయ్ లవ్ ఇంట్రెస్ట్ లక్ష్మీ అంటూ కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పుస్తకంలో ఏదో రాస్తూ ఉన్న కృతిశెట్టి ఫస్ట్ లుక్ బ్యూటిఫుల్ గా ఉంది.

ఇంకా ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి డిబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =