షార్ట్ ఫిలింస్ లో తన నటన ద్వారా ఆకట్టుకొని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో.. సపోర్టింగ్ రోల్స్ లో నటించి తన మార్క్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని ప్రస్తుతం చిన్న సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నాడు సుహాస్. ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతుం షూట్ ను పూర్తిచేసుకుంటుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనితోపాటు మరో కొత్తసినిమాను లైన్ లో పెట్టేశాడు సుహాస్. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో సుహాస్ హీరోగా కేబుల్ రెడ్డి అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా పూర్తిచేస్తున్నాడు సుహాస్. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి సుహాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Here it is, our first look of @ActorSuhas in, and as #CableReddy ❤️
నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు ✨
In cinemas Summer 2024. Shooting in progress #ShaliniKondepudi @sridharbobbala #BaluVallu #PhaniAcharya @thefanmadefilms #LittleThoughtsCinemas pic.twitter.com/DxgNON3Cc6
— Fan Made Films (@TheFanMadeFilms) September 21, 2023
కాగా షాలిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. మహిరెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. సంగీతం స్మరణ్ సాయి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























