జోరుగా హుషారుగా షికారు పోదమ ఫస్ట్ లుక్ రిలీజ్

santosh sobans joruga hushaaruga shikaaru podama movie first look out

గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. ఈమధ్య కాలంలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ఇంకా అన్నీ మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్ సినిమాలు వచ్చాయి. అవి కూడా సరైన విజయాలని అందించలేకపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం మరో సినిమాతో వస్తున్నాడు సంతోష్ శోభన్. సుభాష్ చంద్ర దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా జోరుగా హుషారుగా షికారు పోదమ అనే సినిమా వస్తుంది. తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ఇండియన్ మ్యాప్ ఉంటుంది..అలానే బస్ తో మొదలైన జర్నీ ని ట్రైన్ ఆ తరువాత ఫ్లైట్ తో చూపిస్తున్నారు. మరి దీన్ని బట్టి ట్రావెలింగ్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో ఫల్గుణి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను మిస్టర్ ప్రొడక్షన్స్ తో స్టోరీ క్యాట్ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఎస్ ఒరిజినల్స్ సంస్థలపై ప్రవీణ్ నంబారు, రవి చెన్నా, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ వంశీ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు.. సాయి సంతోష్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =