ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జంటగా నటించిన నూతన చిత్రం చంద్రముఖి 2. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది. కాగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన ఏకకాలంలో రిలీజ్ కానుంది. అయితే వాస్తవానికి ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హర్రర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన చంద్రముఖి 2 చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మూవీ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రముఖి 2 సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే మూవీ రన్టైమ్ (నిడివి) 2 గంటల 37 నిమిషాలు (157 నిమిషాలు)గా ఉండనుందని తెలిపింది. అయితే, ఇదిలా ఉండగా సెన్సార్ సర్టిఫికేట్లో ఈ చిత్రం నిడివి 172 నిమిషాలుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కాగా హీరో రాఘవ లారెన్స్కు చంద్రముఖి-2 తొలి పాన్ ఇండియా మూవీ కానుంది. కంగనా రనౌత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటంతో బాలీవుడ్ మార్కెట్ లోనూ ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో ప్రముఖ కమెడియన్ వడివేలు, రావు రమేష్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తదితరులు నటించారు. అలాగే ‘చంద్రముఖి’ తొలిభాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసునే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: