స్కంద నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Skanda Update Zee Studios Gets North India Distribution Rights With Fancy Rate

టాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం ‘స్కంద’. ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. ‘అఖండ’ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను నుంచి వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్‌కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హిందీ డిస్ట్రిబ్యూషన్‌ని ప్రముఖ సంస్థ దక్కించుకుంది. జీ స్టూడియోస్ ఫ్యాన్సీ రేట్‌తో ఉత్తర భారత పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. కాగా రామ్ పోతినేని సినిమా హిందీలో రిలీజ్ కానుండటం తొలిసారి కావడం విశేషం. అయితే హిందీ ప్రేక్షకులకు మాత్రం ఆయన సుపరిచితుడే. అదెలా అంటే..? ఆయన నటించిన పలు చిత్రాలు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లో యూట్యూబ్‌లో మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో జీ స్టూడియోస్ హిందీ బెల్ట్‌లో గ్రాండ్‌గా సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఇటీవలే సన్నీడియోల్ కథానాయకుడిగా వచ్చిన ‘గదర్ 2’తో జీ స్టూడియోస్ రికార్డు హిట్ అందుకుంది. దీని తర్వాత వారి నుంచి ఇప్పుడు స్కంద భారీ రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా మరోవైపు యూఎస్‌ఏలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. యూఎస్‌ఏలో మొత్తంగా స్కంద 350కి పైగా లొకేషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజా అప్‌డేట్‌పై యూఎస్‌ లోని మూవీ లవర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్‌ 15నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో మేకర్స్ స్కంద చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 8 =