7/జీ బృందావన కాలనీ రీ రిలీజ్.. థియేటర్స్ వద్ద యూత్ సందడి

7G Brundavan Colony, A Heart Touching Cult Classic Movie Re Released Today

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న రీ రిలీజ్‌ల పరంపరలోకి మరో కల్ట్ సినిమా వచ్చి చేరింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ మరోసారి విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండవు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతుంటాయి. ప్రేక్షకులను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే 2004లో విడుదలైన ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదలై 200 రోజులకి పైగా థియేటర్లలో ఆడి ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. 19 ఏళ్ల తర్వాత ఈ ఆల్‌టైమ్‌ బ్లాక్ బస్టర్‌ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. 4కే వెర్షన్ లో సుమారు 1250 షోలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా థియేటర్లు సందడిగా మారాయి. 2004లో చూసిన మూవీ లవర్స్ తో పాటు నేటి యువత కూడా తొలిసారి వీక్షించేందుకు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు వస్తున్నారు. అయితే ‘7/జీ బృందావన కాలనీ’ చూసి ఈ జెనరేషన్ యూత్ సైతం ఫిదా అవుతున్నారు. ఇంత అద్భుతమైన చిత్రం తాము చూడలేదంటూ వారు కితాబిస్తున్నారు. ఇక మరోసారి ఈ సినిమా మ్యాజిక్ చేయడం ఖాయమని, నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఇది ఒక ల్యాండ్ మార్క్‌ సినిమాగా.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇక ఈ చిత్రంలో చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రలు నటించారు. ఈ చిత్రం తమిళంలో ‘7/G రెయిన్‌బో’ కాలనీ టైటిల్‌తో విడుదలైంది. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్‌ డైరెక్ట్‌ చేయగా.. రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. హీరో రవికృష్ణకు ఇదే తొలి సినిమా కావడం.. అందునా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.

యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ఎవర్‌గ్రీన్‍గా నిలిచిపోయాయి. యువన్ శంకర్ రాజా కూడా ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం మరో విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిలోనూ హీరో రవికృష్ణ మరోసారి లీడ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఒరిజినల్ వెర్షన్‌కు రైటర్‌ కమ్ డైరెక్టర్‌గా పనిచేసిన సెల్వ రాఘవన్‌.. ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఇక ‘7/G బృందావన కాలనీ’ని నిర్మించిన ‘శ్రీ సూర్య మూవీస్‌’ అధినేత ఏఎం రత్నం.. ఈ సీక్వెల్‌ను కూడా నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 1 =