అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించి ఆసినిమాతో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఆ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతోనే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుండటం వల్లే ఆగష్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్ కు వెళ్లింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు చిత్రయూనిట్ ఇప్పటినుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా.. రీసెంట్ గా టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరొక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో అనిల్ కపూర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ కా బాప్ బల్బీర్ సింగ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Anil Kapoor as Balbir Singh!#Animal #AnimalTeaserOn28thSept#AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @VangaPictures @rameemusic @cowvala #ShivChanana @supremesundar @sureshsrajan @royamit1973 pic.twitter.com/noZ3yS2bnu
— Bhadrakali Pictures (@VangaPictures) September 21, 2023
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ రాయ్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి మన్నన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)