కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 18

Netflix CEO Ted Sarandos Meets Mahesh Babu and Trivikram Srinivas
ఓటీటీ

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ను కలిసిన నెట్‍ఫ్లిక్స్ సీఈవో

దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్‏లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా నగరంలో పర్యటిస్తున్న ఆయన వరుసగా పలువురు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. దీనిలో భాగంగా తొలుత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన సరండోస్.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులను కలిశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆయనతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
jr ntr shares interesting post on netflix ceo ted sarandos
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ సీఈఓ తో ఎన్టీఆర్

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది పైన అయిపోయింది. అప్పటికే ఆర్అర్ఆర్ సినిమా కోసమే చాలా ఏళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుంత ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
animal collection report
బాక్సాఫీస్

సెన్సేషన్ సృష్టిస్తున్న యానిమల్

యానిమల్ హావ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.విడుదలై వారం రోజులు అవుతున్నా ఎక్కడా డ్రాప్ లేకుండా వసూళ్లను రాబడుతూ షాక్ ఇస్తుంది.ఓ ఏ రేటెడ్ సినిమా ఇంత భారీ వసూళ్లను రాబట్టకోవడమే ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో ఈసినిమా 563.3కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ నెట్ 300కోట్ల కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ను చేరుకున్న మూడో సినిమా గా యానిమల్ రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu, Akkineni Nagarjuna Extends Wishes to Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున, మహేష్ బాబు

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు మరికొందరు…

Srikanth Mవాట్సాప్
samantha citadel web series release date fixed
రిలీజ్ అప్‌డేట్

సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది సమంత. రీసెంట్ గానే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గత కొద్దికాలంగా మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే చికిత్స కోసం కొంత కాలం గ్యాప్ కూడా తీసుకుంటుంది. అయితే తన నుండి త్వరలో రాబోతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ వస్తుంది. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్…

TFN Adminవాట్సాప్
Allu Arjun Reviews Ranbir Kapoor's Animal and Praises Movie Team
సినిమా వార్తలు

'యానిమల్' జస్ట్ మైండ్ బ్లోయింగ్ - అల్లు అర్జున్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్'. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకతం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్‌బీర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని, డైరెక్టర్ సందీప్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. దీనికితోడు మరోవైపు సాధారణ ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Srikanth Mవాట్సాప్
ranbir kapoor first week worldwide collections
బాక్సాఫీస్

యానిమల్ ఫస్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈసినిమా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
extra ordinary man telugu review
రివ్యూ

రివ్యూ : ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

ఓవరాల్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లాజిక్స్ ను పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నచ్చేస్తుంది. నితిన్ కామెడీ,యాక్షన్ సినిమాలో హైలెట్ అయ్యాయి.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే వారికి ఈసినిమాకు బాగా నచ్చుతుంది.

Mahender Reddyవాట్సాప్
Netflix CEO Ted Sarandos Meets Ram Charan and Mega Star Chiranjeevi
ఓటీటీ

రామ్ చరణ్ ఇంట్లో.. మెగాస్టార్ చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ని కలుసుకున్నారు. గురువారం (డిసెంబర్ 7, 2023) సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన తన టీమ్‌తో కలిసి నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చరణ్‌తోపాటు ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా నెట్‌ఫ్లిక్స్ సీఈవోతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ సెల్ఫీలు దిగారు. రామ్ చరణ్, చిరంజీవిలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ ఫొటోలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్…

Srikanth Mవాట్సాప్
hrithik roshan fighter movie teaser out now
ట్రైలర్ & టీజర్

హృతిక్ ఫైటర్ టీజర్ రిలీజ్

బాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హృతిక్ నుండి రాబోతున్న ఫైటర్ సినిమా కూడా ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయతే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.

TFN Adminవాట్సాప్
hi nanna movie blasting first day usa collections
బాక్సాఫీస్

హాయ్ నాన్న బ్లాస్టింగ్ యూఎస్ఏ కలెక్షన్స్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో లవ్ స్టోరీని యాడ్ చేసి ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతంచేసుకొని డీసెంట్ హిట్ ను అందుకుంది. కథ, నాని యాక్టింగ్, నాని-మృణాల్ మధ్య కెమిస్ట్రీ, ఇంకా బేబి ఖైరా నటన, హేషమ్ అబ్దుల్ సంగీతం ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
devil release date announced
రిలీజ్ అప్‌డేట్

డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల తేదీ ఖరారైయింది.నిజానికి నవంబర్ లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక ఈసినిమా డిసెంబర్ 29న విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించున్నాడు.

Mahender Reddyవాట్సాప్
KGF Star Yash New Movie Title Revealed
సినిమా వార్తలు

కేజీఎఫ్ స్టార్ యష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..

'కే.జీ.ఎఫ్' సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు కన్నడ రాక్ స్టార్ యష్. తొలుత పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అనంతరం దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'కే.జీ.ఎఫ్ - చాప్టర్ 2' మొదటి భాగానికి మించి సూపర్ హిట్ అయింది. కాగా ఈ సినిమాతో యష్.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈసారి ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్ళతో రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది. అప్పటినుంచి యష్ నుండి కొత్త సినిమా రాలేదు. దీంతో యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని మూవీ లవర్స్…

Srikanth Mవాట్సాప్
sreeleela on guntur kaaram movie second single
సినిమా వార్తలు

గుంటూరు కారం సెకండ్ సింగిల్- క్యూరియాసిటీ పెంచతున్న మేకర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్

TFN Adminవాట్సాప్
Jigarthanda Double X is Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జిగర్ తండ డబుల్ ఎక్స్'. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరియు మరో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'జిగర్ తండ' సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi and Many More Celebrities Extends Wishes To CM Revanth Reddy
సినిమా వార్తలు

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. మెగాస్టార్ సహా పలువురు సెలబ్రిటీల శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు…

Srikanth Mవాట్సాప్
nawazuddin siddiqui starts dubbing for saindhav movie
సినిమా వార్తలు

సైంధవ్- నవాజుద్దీన్ సిద్ధిఖీ డబ్బింగ్ ప్రారంభం

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ 'రాంగ్ యూసేజ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

TFN Adminవాట్సాప్
Manchu Manoj Said Sorry To Fans For He Takes Long Gap From Movies
సినిమా వార్తలు

ఏడేళ్ళ గ్యాప్ తర్వాత, ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తున్నా - మంచు మనోజ్

తమని ఎంతగానో అభిమానించే అభిమాని కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ‘ఉస్తాద్‍’, ఇంత గొప్ప కాన్సప్ట్ ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా వుందిని పేర్కొన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్‌. ఈ మేరకు ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్‍’ ర్యాంప్‍ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్‌ షో ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్‌ షో డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
ranbir kapoor animal movie joins in 500 crore club
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో చేరిన యానిమల్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి ఊపిరి పోసుకుంది. ఆమధ్య సరైన సినిమాలు లేక వెలవెలపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆమధ్య జవాన్ రికార్డలు క్రియేట్ చేయగా.. ఇప్పుడు యానిమల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వచ్చింది. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Director Harish Shankar Reviews Animal and Praises Sandeep Reddy Vanga
సినిమా వార్తలు

అతని పేరులోనే 'వంగా' అని ఉంటే.. విమర్శలకు వంగుతాడా? - డైరెక్టర్ హరీష్ శంకర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన లేటెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్’. 'అర్జున్ రెడ్డి'ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో రణ్‌బీర్‌ కపూర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ‘యానిమల్’ ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీ చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం 'యానిమ‌ల్'పై ప్రశంసలు…

Srikanth Mవాట్సాప్

షేర్