హాయ్ నాన్న బ్లాస్టింగ్ యూఎస్ఏ కలెక్షన్స్

hi nanna movie blasting first day usa collections

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో లవ్ స్టోరీని యాడ్ చేసి ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతంచేసుకొని డీసెంట్ హిట్ ను అందుకుంది. కథ, నాని యాక్టింగ్, నాని-మృణాల్ మధ్య కెమిస్ట్రీ, ఇంకా బేబి ఖైరా నటన, హేషమ్ అబ్దుల్ సంగీతం ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా యూఎస్ఏలో కూడా మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ఆ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చూస్తేనే చెప్పొచ్చు అక్కడ ఎంత మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో. ఫస్ట్ డేనే ఈసినిమాకు 450కే డాలర్లను సొంతం చేసుకుంది. వీకెండ్ వచ్చేస్తుంది.. ఈరెండు రోజులు కూడా ఈసినిమాకు కలిసొచ్చే అంశం.. దీంతో 1మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమని తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ఇంకా బేబి ఖైరా తో పాటు జయ రామ్, ప్రియదర్శి ,విరాజ్ అశ్విన్ పలు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి,విజేందర్ రెడ్డి తీగల ఈసినిమాను నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా.. షాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.