యానిమల్ హావ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.విడుదలై వారం రోజులు అవుతున్నా ఎక్కడా డ్రాప్ లేకుండా వసూళ్లను రాబడుతూ షాక్ ఇస్తుంది.ఓ ఏ రేటెడ్ సినిమా ఇంత భారీ వసూళ్లను రాబట్టకోవడమే ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో ఈసినిమా 563.3కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ నెట్ 300కోట్ల కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే 500 కోట్ల మార్క్ ను చేరుకున్న మూడో సినిమా గా యానిమల్ రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్ ,డంకి వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఫుల్ రన్ లో యానిమల్ కు 1000 కోట్లు సాధ్యమయ్యేలానే ఉంది.మరోవైపు కంటెంట్ విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్న జనాలు అవేమి పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు.ఈసినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాలోకి ఎంట్రీ ఇచ్చింది.సినిమా కొనుకున్న బయ్యర్లకు జాక్ పాట్ తగిలినట్లే.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే యానిమల్ ఇక్కడ కూడా జోరు చూపిస్తుంది.కొత్త సినిమాలు విడుదలవుతున్న వాటిని తట్టుకొని కలెక్షన్లను రాబట్టుకుంటుంది.వారం రోజుల్లో దాదాపుగా 57కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేయగా రణబీర్ కపూర్ హీరోగా నటించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: