శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈసినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా తన పాత్రకు సంబధించిన డబ్బింగ్ ని ప్రారభించారు. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి స్పెషల్ వీడియోని విడుదల చేశారు. నవాజుద్దీన్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెబుతున్న ఈ వీడియో ఎంతగానో అలరించింది.
Adding his mark signature touch to ‘Vikas Malik’💥
The National Award-Winning Actor @Nawazuddin_S begins dubbing for #SAINDHAV ❤️🔥#SaindhavOnJAN13th
Victory @VenkyMama @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/3BM2mraKMN
— Niharika Entertainment (@NiharikaEnt) December 6, 2023
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: