ఓటీటీలోకి వచ్చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jigarthanda Double X is Now Streaming on OTT

కోలీవుడ్ ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. ఈ సినిమాలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరియు మరో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన ‘జిగర్ తండ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా లెవెల్లో నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 8, 2023) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో అందుబాటులోకి ఉంది. అలాగే అతి త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =