బాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హృతిక్ నుండి రాబోతున్న ఫైటర్ సినిమా కూడా ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయతే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో ఉంది. మమ్మల్ని కనుగొనాలంటే? మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే? మీరు జోక్ చేయాలి అంటూ టీజర్ అయితే ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. యాక్షన్ అండ్ గ్రాండ్ విజువల్స్ తో ఉన్న టీజర్ అదరిపోయింది.
हर उड़ान वतन के नाम! 🇮🇳
Fighter forever. #FighterTeaser Out Now – https://t.co/QCiae3kWG8 pic.twitter.com/idUvDoNGfW
— Hrithik Roshan (@iHrithik) December 8, 2023
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: