కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 15

virupaksha movie new record in ott
ఓటీటీ

ఓటీటీలో విరూపాక్ష మరో రికార్డ్

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమాకు కార్తీక్ దండు మేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
aadhi pinisetty Sabdham movie First Look poster out now
ఫస్ట్ లుక్

శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నటుడు ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ ఇలా ప్రతి పాత్రలోనూ తన నటనతో ఆకట్టుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆది కూడా రొటీన్ గా ఉండే కథల కంటే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే ఆది నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ శబ్దం. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Rana Daggubati and Director Teja Re-unite Again For New Film Rakshasa Raja
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి - డైరెక్టర్ తేజ కాంబోలో రాక్షస రాజా

'బాహుబ‌లి' సిరీస్ తర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి. ప్ర‌స్తుతం ఆయన ర‌జ‌నీకాంత్ 'వేట‌గాడు'లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న పౌరాణిక సినిమా 'హిర‌ణ్య‌క‌శ్య‌ప' చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రానా దగ్గుబాటి మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. చిన్న చిత్రాలతో పెద్ద హిట్స్ అందుకునే ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు.

Srikanth Mవాట్సాప్
allari naresh interesting poster from Naa Saami Ranga movie
ఫస్ట్ లుక్

నా సామిరంగ- ఇంట్రెస్టింగ్ గా అల్లరి నరేష్ పోస్టర్

కింగ్ నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున నుండి రాబోతున్న సినిమా నా సామిరంగ. చాలా కాలం తరువాత మళ్లీ ఓ మాస్ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున. విజయ్‌ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
dhanush captain miller movie trailer update
ట్రైలర్ & టీజర్

త్వరలో రానున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్

రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా పొంగల్ రేసులో రానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ గురించి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చాడు ధనుష్. ఈసినిమా ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
RGV Vyooham Gets Censor Certificate and Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం'కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ

రామ్‌గోపాల్‌ వ‌ర్మ‌.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్‌లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో 'రంగీలా', 'సత్య', 'సర్కార్' వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. 'పవర్ స్టార్', 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మరియు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Srikanth Mవాట్సాప్
which song impressed you the most
సాంగ్

సలార్, గుంటూరు కారం మీకు నచ్చిన పాట?

త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో పలు ఇట్రెస్టింగ్ సినిమాలు ఉండగా అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో సలార్, గంటూరుకారం సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈనెలలో సలార్ సినిమా రిలీజ్ అవుతుండగా.. గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే రెండు సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. సలార్ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బజీగా ఉంది. మరోవైపు గుంటూరు కారం సినిమా కూడా ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సలార్ నుండి సూరీడే పాటను అలానే గుంటూరు కారం…

TFN Adminవాట్సాప్
adivi sesh and shruti haasan movie title and first look update
ఫస్ట్ లుక్

శేష్ కొత్త సినిమా ప్రీ లుక్- ఫస్ట్, టైటిల్ లుక్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుపోతున్నాడు. ఇక ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే అడివిశేష్ ఈసారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటివరకూ థ్రిల్లర్ ఇంకా స్పై నేపథ్యంలో ఉన్న సినిమాలనే ఎక్కువగా చేశాడు అడివి శేష్. ఇప్పుడు ఆ రూట్ ను మార్చి ప్రేమ కథతో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Ravi Teja and Director Harish Shankar Reunite Again For New Film
సినిమా వార్తలు

రవితేజ, హరీష్ శంకర్ మాస్ కాంబో రిపీట్

టాలీవుడ్‌లో కొందరు హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. దీంతో మళ్ళీ వీరు ఎప్పుడు కలిసి వర్క్ చేస్తారా అని అటు అభిమానులతోపాటు ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారిలో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ ఒకటి. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన 'మిరపకాయ్' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికంటే ముందు 'షాక్' సినిమాతో హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు 'మాస్ మహారాజా' అనే ట్యాగ్ ఇచ్చింది హరీష్ శంకర్.

Srikanth Mవాట్సాప్
salaar ceasefire first single sooreede song out now
సాంగ్

సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ రిలీజ్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. కె.జి.యఫ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈసినిమా రెండు భాగాలుగా వస్తుండగా సలార్-సీజ్ ఫైర్ అనే టైటిల్ తో మొదటి పార్ట్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి క్యూరియాసిటీని రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
prashanth neel about salaar movie
సినిమా వార్తలు

సలార్ ఎమోషన్-ఫ్రెండ్షిప్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
oh my baby song released from guntur kaaram movie
సాంగ్

గుంటూరు కారం- ఓ మై బేబి సాంగ్ రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఎట్టిపరిస్థితిల్లోనూ ఈసినిమాను చెప్పిన టైమ్ కే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆదిశగానే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
bubble gum movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

బబుల్ గమ్ షూటింగ్ ఫైనల్లీ కంప్లీట్

ఇండస్ట్రీకి వారసులు రావడం అనేది కామనే. ఇప్పటికే ఎంతోమంది వారసలు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అతనెవరో కాదు రాజీవ్ కనకాల, సుమల వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రోషన్ పెర్ఫామెన్స్ కు మంచి అప్లాజే దక్కింది. తాజాగా ఈసినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ గా…

TFN Adminవాట్సాప్
Siddharth Lends Voice For Shiva Karthikeyan's Ayalaan Movie
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ 'అయలాన్'కి వాయిస్ అందిస్తోన్న హీరో సిద్దార్థ్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అయలాన్'. తెలుగులోనూ శివ కార్తికేయన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్, 'జాతి రత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే 'మహా వీరుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న 'అయలాన్' మూవీ సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Animal 12 Days Collections Ranbir Kapoor's Action Film Earns Rs 757.73 Cr Worldwide
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద యానిమల్ హవా.. మరో 2 సినిమాల రికార్డులు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రణ్‍బీర్‌ కపూర్‌ నటన, సందీప్ వంగా టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయని సాధారణ ప్రేక్షకులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దీంతో 'యానిమల్' ఇండియాలోనే కాకుండా…

Srikanth Mవాట్సాప్
Animal Actress Tripti Dimri Expresses Her Interest to Act with Jr NTR
సినిమా వార్తలు

జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉంది - యానిమల్ నటి త్రిప్తి డిమ్రీ

త్రిప్తి డిమ్రీ.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతోన్న పేరు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ అమ్మడి గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్' ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఇందులో రణ్‍బీర్‌తో కలిసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ.. కుర్రకారును ఆకట్టుకుని మరో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. కాగా బాలీవుడ్‌లో ఇంతకుముందు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో…

Srikanth Mవాట్సాప్
eagle movie makers clarity on release date again
రిలీజ్ అప్‌డేట్

ఈగల్ రిలీజ్ డేట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా ఒకటి ఉంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలను బట్టి రవితేజ మేకోవర్ కు మాత్రం మంచి స్పందన వస్తుంది.

TFN Adminవాట్సాప్
Hero Sriram Reveals Interesting Facts About Pindam Movie
సినిమా వార్తలు

అసలు సిసలైన హారర్ సినిమా పిండం - హీరో శ్రీరామ్

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
whats your opinion on devil movie trailer?
ట్రైలర్ & టీజర్

కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ పై మీ అభిప్రాయం?

ప్రయోగాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోల్లో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సినిమా ఫలితాలు పక్కన పెడితే కాస్త కొత్తగా ఉండేలా సినిమాలు చేయడానికే చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

TFN Adminవాట్సాప్
Devil Trailer Launch Event Kalyan Ram Gives Interesting Updates About Devara and Bimbisara 2
ట్రైలర్ & టీజర్

డెవిల్‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌.. దేవర, బింబిసార 2లపై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్‌’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా తన అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్‌ సీక్రెట్‌ బ్రిటీష్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్‌ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా అంతటా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో…

Srikanth Mవాట్సాప్

షేర్