నా సామిరంగ- ఇంట్రెస్టింగ్ గా అల్లరి నరేష్ పోస్టర్

allari naresh interesting poster from Naa Saami Ranga movie

కింగ్ నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున నుండి రాబోతున్న సినిమా నా సామిరంగ. చాలా కాలం తరువాత మళ్లీ ఓ మాస్ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున. విజయ్‌ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి తాజాగా సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో అల్లరి నరేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు మేకర్స్. ఈసినిమాలో అల్లరి నరేష్ అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు. మా అంజి గాడ్ని ప‌రిచ‌యం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్త‌ది అంటూ అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. మరోసారి అల్లరి నరేష్ గుర్తుండిపోయే పాత్రతో రాబోతున్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seventeen =