ఇండస్ట్రీకి వారసులు రావడం అనేది కామనే. ఇప్పటికే ఎంతోమంది వారసలు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అతనెవరో కాదు రాజీవ్ కనకాల, సుమల వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రోషన్ పెర్ఫామెన్స్ కు మంచి అప్లాజే దక్కింది. తాజాగా ఈసినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ పూర్తయిపోయిందని తెలిపారు. ట్రైలర్ కోసం డిసెంబర్ 15వ తేదీ వరకూ వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
🎬And… That’s a wrap ✨
The final clap echoes, the last scene unfolds – the #Bubblegum shoot is officially wrapped up 💯
Get ready for the trailer on DEC 15th @ 11:44AM 💥
In cinemas from Dec 29th 🎥@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou pic.twitter.com/jMQHGrOrzM
— Maheshwari Movies (@maheshwarimovie) December 13, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: