నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్‌ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా అంతటా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ సంయుక్తా మీనన్ మరియు మాళవికా నాయర్ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘మంచి కథ, విజువల్స్, సంగీతం, టీమ్ వర్క్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ‘బింబిసార’ సమయంలో చెప్పాను, దాన్ని మీరు నిజం చేశారు. అదే విధంగా డెవిల్ కూడా థియేటర్లలోకి వస్తోంది. మంచి కథ, సంగీతం, విజువల్స్‌తో.. 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి కథను సిద్ధం చేసిన శ్రీకాంత్‌కి, అద్భుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారికి, వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్‌గారికి ధన్యవాదాలు.. ఇవన్నీ కలిపి చూస్తే బావుంటుందని భావించి ఎలాంటి తడబాటు లేకుండా గొప్ప సినిమా తీసిన అభిషేక్ నామా గారికి కృతజ్ఞతలు. సినిమా అంటే టీమ్ ఎఫర్ట్.. ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. డిసెంబర్ 29న డెవిల్ మిమ్మల్ని థియేటర్లలో స్టన్ చేస్తుంది. నా మాట నమ్మండి, డెవిల్ చాలా బాగుంటుంది. మీకు కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు డెవిల్ కొత్త కథను కలిగి ఉంది” అని తెలిపారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి ‘బింబిసార 2’ని స్టార్ట్ చేస్తాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర విషయానికి వస్తే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమా తీసిన తర్వాత ఓ యాక్టర్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ చేతిలో చాలా బాధ్యత ఉంటుంది. చిన్న పొరపాటు జరిగితే ప్రేక్షకులు ఊరుకోరు. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. ది గ్లింప్స్ త్వరలో రాబోతోంది. ప్రస్తుతం గ్లింప్స్ పని జరుగుతోంది మరియు VFX చాలా సమయం తీసుకుంటుంది. మేము చూపించబోయే కొత్త ప్రపంచాన్ని చూసేందుకు మీరందరూ ఓపిక పట్టాలి. బృందం త్వరలో సంగ్రహావలోకనం విడుదల తేదీని ప్రకటిస్తుంది. డిసెంబర్ 29న, డెవిల్‌ని చూసి ఆనందించండి” అని కళ్యాణ్ రామ్ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































