
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 16


హాయ్ నాన్నలేటెస్ట్ కలెక్షన్స్

తలైవా 170 టైటిల్ రిలీజ్

సలార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

యానిమల్ 11డేస్ కలెక్షన్స్

థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న డెవిల్ ట్రైలర్

అడివి శేష్-శృతీహాసన్ కాంబో ఫిక్స్

బబుల్ గమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇప్పట్లో అప్ డేట్లు లేవు- OG మేకర్స్ క్లారిటీ

హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్దు- బొమ్మరిల్లు భాస్కర్ మూవీ షూటింగ్ మొదలు

సైంధవ్ సెకండ్ సింగిల్ రిలీజ్

బాక్సాఫీస్ వద్ద యానిమల్ సంచలనం

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

హాయ్ నాన్నపై అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నారంటే?

డెవిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో దేవర గ్లింప్స్-ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది ఈసినిమా.

హాయ్ నాన్నలేటెస్ట్ కలెక్షన్స్
నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.మొదటి రెండు రోజులు నామ మాత్ర వసూళ్లతో నిరాశపరచగా తరువాత అనూహ్య రీతిలో పుంజుకుంది.ముఖ్యంగా మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో శనివారం,ఆదివారాల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న కూడా డీసెంట్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 44కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇందులో షేర్ 23కోట్లు. మరో 5కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే. ఈవారం పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా హాయ్ నాన్నకు కలిసి రానుంది.

తలైవా 170 టైటిల్ రిలీజ్
జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

సలార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
ఈ నెలలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైనల్లీ ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగంగా సలార్..సీజ్ ఫైర్ అనే టైటిల్ తో భాగం రాబోతుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

యానిమల్ 11డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద యానిమల్ వేట కొనసాగుతూనే వుంది.రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రీయేట్ చేస్తుంది.నార్త్ లో అయితే తిరుగులేని హోల్డ్ తో వసూళ్లను రాబడుతుండగా సౌత్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 737.98కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇందులో దేశ వ్యాప్తంగా హిందీ నెట్ 401.49కోట్లు.అంతేకాదు కేవలం 11రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించి జవాన్ సరసన నిలిచింది.ఓవరాల్ గా హిందీ లో 400 కోట్ల నెట్ క్లబ్ లో చేరిన 6వ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.ఇంతకుముందు జవాన్ తోపాటు…

థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న డెవిల్ ట్రైలర్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆతరువాత అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఇదొక పీరియడ్ డ్రామా. 1940 బ్యాక్ డ్రాప్ లో బ్రిటీష్‌వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

డంకీ రిలీజ్‌కు ముందు.. వైష్ణోదేవిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏడాది ఆరంభంలో 'పఠాన్'.. ఆ తర్వాత 'జవాన్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు కింగ్ ఖాన్. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని విధంగా ఆయన నటించిన ఈ రెండు సినిమాలు రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించాయి. దీనిని కొనసాగిస్తూ తాజాగా షారుఖ్ త్వరలోనే మరో కొత్త సినిమా 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తుండగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న 'డంకీ' ప్రపంచవ్యాప్తంగా…

అడివి శేష్-శృతీహాసన్ కాంబో ఫిక్స్
ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ లో అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఆ కాంబినేషన్ మరేదో కాదు అడివి శేష్ ఇంకా శృతి హాసన్ ది. అడివిశేష్ ఇప్పటికే గూఢచారి సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు.

బబుల్ గమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఇప్పట్లో అప్ డేట్లు లేవు- OG మేకర్స్ క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు ఒకవైపు రాజకీయాతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య పూర్తిగా రాజకీయాలతోనే బిజీఅయిపోయారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల నుండి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్‌ను లాంచ్ చేయగా.. ఇవి చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ అండ్ క్లాసీ బీట్స్…

సిద్దు- బొమ్మరిల్లు భాస్కర్ మూవీ షూటింగ్ మొదలు
గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చేే ఏడాది రిలీజ్ కానుంది. నీరజ కోన దర్శకత్వంలో తెలుసుకదా అనే సినిమాను కూడా చేస్తున్నాడు.

సైంధవ్ సెకండ్ సింగిల్ రిలీజ్
సీనియర్ హీరో వెంకటేష్ ఎట్టకేలకు మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.2021లో నారప్ప,దృశ్యం 2 సినిమాల్లో నటించాడు వెంకీ.అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ఆ రెండు కూడా డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదలయ్యాయి.దాంతో ఫ్యాన్స్ నిరాశకుగురయ్యారు.తమ అభిమాన హీరోను డైరెక్ట్ గా థియేటర్లో చూసుకొని చూసి చాలా రోజులవుతుంది.

బాక్సాఫీస్ వద్ద యానిమల్ సంచలనం
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా.. 'అర్జున్ రెడ్డి' 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. రిలీజైన నాటినుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు.

హాయ్ నాన్నపై అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నారంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించగా.. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. మలయాళం కంపోజర్, 'హృదయం' ఫేమ్ హేశమ్ అబ్దుల్ వహబ్ అందించిన హర్ట్ టచింగ్ ట్యూన్స్ సినిమాకి ఎస్సెట్ గా నిలిచాయి. కాగా శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం తన…

ఓ మై బేబీ సాంగ్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ ఈనెల 13న విదులకానుందని తెలిసిందే.ఇక అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.33 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ప్రోమో మహేష్ బాబు డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది.ఓ మై బేబీ అంటూ సాగే ఈసాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా శిల్పా రావు తన గాత్రాన్ని అందించింది. .ఓవరాల్ గా ప్రోమో అయితే సాంగ్ ఫై అంచనాలను పెంచేసింది.మరి ఫుల్ సాంగ్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

విజయవాడలో సైంధవ్ టీమ్.. కనకదుర్గమ్మను దర్శించుకున్న వెంకటేష్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్'. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇది వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ టీమ్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

హాయ్ నాన్న- చిన్న పిల్లల కోసం సామ్ స్పెషల్ స్క్రీనింగ్
స్టార్ హీరోయిన్ సమంత కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యూష పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తుంది. ఇప్పుడు మరో మంచి పని చేసి ప్రశంసలు అందుకంటుంది. న్యాచురుల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిన్నారుల కోసం హాయ్ నాన్న స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. దీంతో సమంత చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

డెవిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. బ్రిటీష్ వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా సినిమాను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను…