కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 128

prabhu deva congratulates rrr team in natu natu style with 100 members
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - వంద మందితో ప్రభుదేవా నాటు స్టెప్పులు

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయి మరో మెట్టు పైకి ఎక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో మందికి స్పూర్తి గా నిలిచింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా జపాన్ లో అయితే కొత్త రికార్జులు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎదురుచూసిన నాటు నాటు సాంగ్ కు కూడా ఆస్కార్ అవార్డు వరించడంతో ఇండియన్ సినిమా మొత్తానికి దక్కినట్టుగా అందరూ భావిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీలు…

TFN Adminవాట్సాప్
Dasara Movie Team Releases A Special Poster
ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన దసరా మూవీ స్పెషల్ పోస్టర్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
sanjay dutt completes kashmir schedule for leo movie
షూటింగ్ అప్‌డేట్

లియో- సంజయ్ కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్

రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ntr 30 movie official launch date announced
సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 తుఫాన్ కు ముహూర్తం ఫిక్స్

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. ఇక రీసెంట్ గా ఈసినిమా లాంచింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. అయితే అదే టైమ్ లో తారకరత్న చనిపోవడంతో వాయిదా వేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొని అవి కూడా ముగించుకొని వచ్చారు.

TFN Adminవాట్సాప్
ram charans magadheera movie re release postponed
సినిమా వార్తలు

మగధీర రీరిలీజ్ పై మేకర్స్ క్లారిటీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో 'మగధీర' సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. మగధీర’ చిత్రం మొత్తం తొమ్మిది నంది అవార్డులు కైవసం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ponniyin selvan 2 first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా ఆయనకు సూపర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్స్ ను అందించి పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను మార్చి…

TFN Adminవాట్సాప్
senior actress Simran joins aadhi pinisetty Sabdham movie
సినిమా వార్తలు

శబ్దం లో మరో సీరియర్ హీరోయిన్

టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
jr ntr interesting comments on his career
సినిమా వార్తలు

నటుడిగా ఆరోజే పుట్టా అంటున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Chiranjeevi's Superb Reply To Amit Shah About RRR
సినిమా వార్తలు

ఈ విజయం 'ఆర్ఆర్ఆర్' టీం అందరిది - చిరంజీవి

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సాంగ్ కు ఇంత గొప్ప అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా , రామ్ చరణ్ ను అభినందించారు. ఆస్కార్ ఈవెంట్ ను ముగించుకొని నిన్న ఇండియా చేరుకున్న రామ్ చరణ్, అమిత్ షా ఆహ్వానం మేరకు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లి ఆయనను కలిశారు. రామ్ చరణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి కూడా వున్నారు.అనంతరం రామ్ చరణ్ ను అమిత్ షా అభినందనలు తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
Jr NTR Fun With Fans About His Next Movie
సినిమా వార్తలు

నేను నెక్స్ట్ మూవీ చేయడం లేదు - ఎన్టీఆర్

ఆస్కార్ అవార్డు ఈవెంట్ వెళ్లి ఇండియా చేరుకున్న ఎన్టీఆర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్న శిల్పకళావేదిక లో ఈఈవెంట్ జరిగింది. ఇక ఈ వేడుక లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధమ్కీ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ ,ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్ అంటూ అరిచారు. దాంతో ఎన్టీఆర్ నేను నెక్స్ట్ సినిమా చేయట్లేదు అని అన్నారు అయితే వెంటనే మళ్ళీ మీరు అలాగే చేస్తే నేను నెక్స్ట్ సినిమా చెయ్యట్లేదు ఆపేస్తా అని చెప్పాల్సి వస్తుందని అని మీరు ఆపమన్న నేను ఆపలేను, నేను ఆపిన మీరు ఊరుకోరు కానీ త్వరలోనే మీకు కావాల్సిన అప్డేట్ వస్తుందంటూ అది ఇంకొక…

Mahender Reddyవాట్సాప్
Kohli Dances for Naatu Naatu Song
సాంగ్

నాటు నాటు సాంగ్ కి కోహ్లీ డాన్స్

బ్లాక్ బాస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డు ను ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. దాంతో ఈసాంగ్ కి ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
ram charan wants to do virat kohli biopic
సినిమా వార్తలు

ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా

తనకు బయోపిక్ తీసే ఛాన్స్ వస్తే ఆ స్టార్ క్రికెకటర్ బయోపిక్ లో నటిస్తా అని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే కింగ్ విరాట్ కోహ్లీ. గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి యూఎస్ లో సండి చేసిన సంగతి తెలిసిందే కదా. తను, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటంతో ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఎంతో మంది కలలను నిజం చేస్తూ ఫైనల్ గా నాటు నాటు పాట ఆస్కార్ ను గెలుచుకొని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక చిత్రయూనిట్ తిరిగి రావడం జరిగింది.

TFN Adminవాట్సాప్
sushanth on board for chiranjeevi movie bhola shankar
సినిమా వార్తలు

కన్ఫామ్ భోళాశంకర్ లో సుశాంత్

అక్కినేని వారసత్వం నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుశాంత్. ఇక ఇప్పుడు సుశాంత్ తన రూట్ ను మార్చి హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఆ తరువాత వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పుడు పలు సినిమాల్లో పలు విభిన్నమైన పాత్రలను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటికే రావణాసుర సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

TFN Adminవాట్సాప్
Akkineni Fans are delighted with Naga Chaitanya's look in custody
సినిమా వార్తలు

అక్కినేని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. 'గ్యాంబ్లర్ , మన్నాడు' ఫేమ్ వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ఈ సినిమా టీజర్ ను విడుదలచేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 24గంటల్లో కస్టడీ తెలుగు , తమిళ వెర్షన్ టీజర్ 11 మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ టీజర్ ఇదే కావడం విశేషం. తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ హ్యాపీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
vishwak sen about dual role in dhamki movie
సినిమా వార్తలు

ధమ్కీ రెండు సినిమాలు చేసినట్టుంది

ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది.ఇప్పటికే ట్రైలర్ 1.0 సినిమాపై అంచనాలను పెంచగా.. రీసెంట్ గానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.

TFN Adminవాట్సాప్
South Heroines Hungama In Bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్స్ హవా

ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా మన సౌత్ హీరోయిన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా, పాన్ ఇండియా రేంజ్ లోనూ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ స్టార్ హీరోయిన్…

Team TFNవాట్సాప్
Kamal Haasan Indian 2 Movie Update
సినిమా వార్తలు

కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ అప్ డేట్

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్స్ బ్యానర్స్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ సీక్వెల్ ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ముగ్గురు కథానాయికలు కాగా ఏడుగురు విలన్స్ నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై లో పలు యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Creates A New Record on Social Media
సినిమా వార్తలు

రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ క్రేజ్ తో మహేష్ అటు సోషల్ మీడియా లో కూడా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తాజాగా ఈ విషయంలో మహేష్ కొత్త రికార్డు ను సృష్టించారు. మహేష్ ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 10మిలియన్లకు చేరుకుంది దీంతో ఇంస్టాగ్రామ్ తోపాటు, ట్విట్టర్ , ఫేస్ బుక్ లో 10మిలియన్ల కు పైగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక సౌత్ హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించారు. అందులో భాగంగా ట్విట్టర్ లో ప్రస్తుతం మహేష్ కు 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్ లో 15మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు.

Mahender Reddyవాట్సాప్
ugram movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఉగ్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంతకుముందు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్య కాలంలో నాంది, ఇట్లు మారేడిమిల్లి నియోజకవర్గం లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. నాంది తరువాత అల్లరి నరేష్-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ కథతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
keerthy suresh latest photos goes viral
సినిమా వార్తలు

కీర్తి కిల్లింగ్ లుక్స్

టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లో కాస్త గ్లామర్ రోల్స్ తక్కువగా చేసే హీరోయిన్లలో కీర్తి సురేష్ ముందుంటుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తరువాత మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో చాలా వరకూ సాఫ్ట్, ట్రెడిషనల్ పాత్రల్లో కనిపించింది కీర్తి సురేష్. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచతూ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా తాజాగా కొన్ని ఫొటోలు షేరు చేసింది. ఆ ఫొటోల్లో కిల్లింగ్ లుక్ తో కీర్తి సురేష్ ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి ఫొటోలు ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్

షేర్