అక్కినేని వారసత్వం నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుశాంత్. ఇక ఇప్పుడు సుశాంత్ తన రూట్ ను మార్చి హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఆ తరువాత వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పుడు పలు సినిమాల్లో పలు విభిన్నమైన పాత్రలను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటికే రావణాసుర సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. మళ్లీ రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. నేడు సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాలో సుశాంత్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ గా సుశాంత్ నటించనున్నట్టు తెలుస్తుంది.

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























