ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బీజీగా ఉంది.ఇప్పటికే ట్రైలర్ 1.0 సినిమాపై అంచనాలను పెంచగా.. రీసెంట్ గానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈసినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు తెలియచేశారు. ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను .. ఇలా చేయడం ఫస్ట్ టైమ్. రెండు పాత్రలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అందువలన ఒకేసారి రెండు సినిమాలు చేసినట్టుగా అనిపించింది. ఈ ఒక్క సినిమా కోసమే ఏడాదిన్నర పట్టింది. హీరోగా మాత్రమే అయితే ఈ పాటికి మూడు సినిమాలు చేసేవాడిని అని తెలిపాడు. ఈ సినిమా ఫస్ట్ పార్టులో ఎంత ఎంజాయ్ చేస్తారో .. ఎంత నవ్వుకుంటారో, ఆ తరువాత అంత టెన్షన్ పడతారు. నివేదా పేతురాజ్ కథ విన్న తరువాతనే చేయడానికి ఓకే అన్నారు. తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంతవరకూ చూడని ఒక కొత్త నివేదాను ఇప్పుడు చూస్తారు అని చెప్పుకొచ్చారు.
కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: