సూపర్ స్టార్ మహేష్ బాబు కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ క్రేజ్ తో మహేష్ అటు సోషల్ మీడియా లో కూడా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తాజాగా ఈ విషయంలో మహేష్ కొత్త రికార్డు ను సృష్టించారు. మహేష్ ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 10మిలియన్లకు చేరుకుంది దీంతో ఇంస్టాగ్రామ్ తోపాటు, ట్విట్టర్ , ఫేస్ బుక్ లో 10మిలియన్ల కు పైగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక సౌత్ హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించారు. అందులో భాగంగా ట్విట్టర్ లో ప్రస్తుతం మహేష్ కు 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్ లో 15మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు.
ఇదిలావుంటే ప్రస్తుతం మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 28వ సినిమాలో నటిస్తున్నారు. గత కొద్దీ రోజులుగా ఈసినిమా టైటిల్ ఇదేనంటూ రక రకలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఆ టైటిల్స్ ఏవీ నిజం కాదని త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
అన్ని కుదిరితే ఈ ఉగాది రోజున ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలచేసే అవకాశాలు వున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఇక త్రివిక్రమ్ ,మహేష్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో ‘అతడు , ఖలేజా’ తెరకెక్కాయి అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు అనుకున్నంతగా వసూళ్లను రాబట్టలేకపోయిన బుల్లితెర పై సత్తా చాటాయి. మరి ఈ మూడో సినిమా వీరికి ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Mahesh Babu Romance Challenge on Sakshi Shivanand | Yuvaraju Telugu Movie | Simran | Brahmanandam
05:27
SVSC Full Songs HD | Mari Antaga Song | Mahesh Babu | Venkatesh | Samantha | Anjali
03:40
SVSC Telugu Movie Scenes | Samantha sees Mahesh Babu for the first time | Venkatesh | Anjali
03:29
SVSC Telugu Full Movie | Part 3 | Mahesh Babu | Venkatesh | Samantha | Latest Telugu Movies 2017
14:53
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.