ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. ఇక రీసెంట్ గా ఈసినిమా లాంచింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. అయితే అదే టైమ్ లో తారకరత్న చనిపోవడంతో వాయిదా వేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొని అవి కూడా ముగించుకొని వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను మొదులపెట్టే డేట్ మళ్లీ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చారు. ఈసినిమా లాంచింగ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. మార్చి 23వ తేదీన ఈసినిమాను లాంచ్ చేస్తున్నట్టు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. దీంతో ఆరోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675
— NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.