యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. ‘గ్యాంబ్లర్ , మన్నాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ఈ సినిమా టీజర్ ను విడుదలచేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 24గంటల్లో కస్టడీ తెలుగు , తమిళ వెర్షన్ టీజర్ 11 మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ టీజర్ ఇదే కావడం విశేషం. తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ హ్యాపీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ టీజర్ లో ఒక చోట నాగచైతన్య , కృతి శెట్టి కలిసి వెళ్తున్న సీన్ చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే ఆ సీన్ లో నాగ చైతన్య లుక్ నాగార్జున యంగ్ లుక్ ను గుర్తుచేసింది. ఆ సీన్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి టీజర్ తో సినిమాకు మంచి బజ్ ను క్రీయేట్ చేయడం లో సక్సెస్ అయ్యింది సినిమా యూనిట్.
ఈ సినిమాలో నాగ చైతన్య ,పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండగా ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 12న కస్టడీ విడుదలకానుంది. ఈ సినిమా పై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: