టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా నటిస్తున్నట్టు తెలుపుతూ తనకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాలో సిమ్రాన్ నటిస్తున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాను 7జీ ఫిలింస్ ఇంకా ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: