ఈ విజయం ‘ఆర్ఆర్ఆర్’ టీం అందరిది – చిరంజీవి

Chiranjeevi's Superb Reply To Amit Shah About RRR

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సాంగ్ కు ఇంత గొప్ప అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా , రామ్ చరణ్ ను అభినందించారు. ఆస్కార్ ఈవెంట్ ను ముగించుకొని నిన్న ఇండియా చేరుకున్న రామ్ చరణ్, అమిత్ షా ఆహ్వానం మేరకు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లి ఆయనను కలిశారు. రామ్ చరణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి కూడా వున్నారు.అనంతరం రామ్ చరణ్ ను అమిత్ షా అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి , రామ్ చరణ్ లను కలవడం చాలా ఆనందంగా వుంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని తెలుగు లో ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి రిప్లై ఇచ్చారు. అమిత్ షా గారు..  మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.ఈ విజయం ఆర్ఆర్ఆర్  టీం అందరిదీ, ఈగుర్తింపు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమది,ఈ ఆస్కార్ భారత దేశ ప్రజలందరికీ లభించిన గౌరవం. భవిష్యత్తు లో భారతీయ చిత్ర పరిశ్రమ చేసే కృషికి మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తాయంటూ బదులు ఇచ్చారు.

ఇక గత ఏడాది అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సమయంలో నోవాటెల్ లో ఎన్టీఆర్ ను కలిసి ఆర్ఆర్ఆర్ లో తన నటనను అభినందించిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.