ఛాన్స్ వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తా

ram charan wants to do virat kohli biopic

తనకు బయోపిక్ తీసే ఛాన్స్ వస్తే ఆ స్టార్ క్రికెకటర్ బయోపిక్ లో నటిస్తా అని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే కింగ్ విరాట్ కోహ్లీ. గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి యూఎస్ లో సండి చేసిన సంగతి తెలిసిందే కదా. తను, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటంతో ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఎంతో మంది కలలను నిజం చేస్తూ ఫైనల్ గా నాటు నాటు పాట ఆస్కార్ ను గెలుచుకొని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక చిత్రయూనిట్ తిరిగి రావడం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే అక్క‌డ నుంచి నేరుగా ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్ కు హాజ‌ర‌య్యాడు రామ్ చరణ్. ఈసందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను ఎప్పటినుండో స్పోర్ట్ బేస్డ్ సినిమా చేయాలనుకుంటున్నాను అని అనగా.. ఈలోపు ఒక జర్నలిస్ట్ విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బావుంటుందని సలహా ఇవ్వగా.. దానికి రామ్ చరణ్ ఆ అవ‌కాశం వ‌స్తే మాత్రం క‌చ్చితంగా విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టిస్తాను. విరాట్ కోహ్లి చాలా ఇన్‌స్పైరింగ్ ప‌ర్స‌నాలిటీ. త‌ను బ‌యోపిక్‌లో న‌టించే చాన్స్ వ‌స్తే వదులుకోను అంటూ సమాధానం ఇచ్చాడు. మరి చూద్దాం ఫ్యూచర్ లో రామ్ చరణ్ కోసం విరాట్ కోహ్లీ కథను తయారు చేస్తారేమో.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సీ 15. లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + nineteen =