ఇంతకుముందు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్య కాలంలో నాంది, ఇట్లు మారేడిమిల్లి నియోజకవర్గం లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. నాంది తరువాత అల్లరి నరేష్-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ కథతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. అల్లరి నరేష్‌ని ఫెరోషియస్ పోలీస్ గా చూపించిన ఉగ్రం టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దేవేరి అనే పాటను మార్చి 19న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాటలు అబ్బూరి రవి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: