ఆస్కార్ అవార్డు ఈవెంట్ వెళ్లి ఇండియా చేరుకున్న ఎన్టీఆర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్న శిల్పకళావేదిక లో ఈఈవెంట్ జరిగింది. ఇక ఈ వేడుక లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధమ్కీ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ ,ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్ అంటూ అరిచారు. దాంతో ఎన్టీఆర్ నేను నెక్స్ట్ సినిమా చేయట్లేదు అని అన్నారు అయితే వెంటనే మళ్ళీ మీరు అలాగే చేస్తే నేను నెక్స్ట్ సినిమా చెయ్యట్లేదు ఆపేస్తా అని చెప్పాల్సి వస్తుందని అని మీరు ఆపమన్న నేను ఆపలేను, నేను ఆపిన మీరు ఊరుకోరు కానీ త్వరలోనే మీకు కావాల్సిన అప్డేట్ వస్తుందంటూ అది ఇంకొక రోజు ఇంకో వేదిక మీద మాట్లాడుకుందాం ఇది దాస్ కా ధమ్కీ కి ఈవెంట్ అంటూ నవ్వుతూ ఫ్యాన్స్ ను కూల్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయాల్సివుంది. ఇప్పటికే ఈ సినిమా లాంచ్ పలుసార్లు వాయిదాపడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈనెల 23న ఈ సినిమా అఫిషియల్ గా లాంచ్ కానుంది. ఈనెల 29నుండి మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ,కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తుండగా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈచిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదల కానుంది.
ఇక ఎన్టీఆర్ కి కొరటాలతో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ 30 కి కూడా మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని కొరటాల పట్టుదలతో వున్నారు.
What a MASSIVE NIGHT it was 😍💥
Here are a few MASS frames from the #DasKaDhamki Pre-Release Event with the Mass Amma Mogudu @tarak9999 ❤️🔥
IN CINEMAS FROM MARCH 22ND 🔥@VishwakSenActor @Nivetha_Tweets @VScinemas_ @VanmayeCreation pic.twitter.com/3KaJy6HbNI
— Telugu FilmNagar (@telugufilmnagar) March 18, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: