నటుడిగా ఆరోజే పుట్టా అంటున్న ఎన్టీఆర్

jr ntr interesting comments on his career

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు విశ్వక్ సేన్ ఎన్టీఆర్ అభిమాని అన్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే తనకు ఇచ్చిన మాట ప్రకారం ఈసినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు నేను ఒకే రకంగా సినిమాలు చేస్తున్నా అని అనుకున్నప్పుడు.. నాలో మార్పు కావాలి అనుకున్నప్పుడు ఓ సినిమా టైం లో ఇక నుంచి మిమ్మల్ని కాలర్ దించుకునేలా చేయను అని చెప్పా.. ఒక నటుడుగా ఆరోజే నేను పుట్టా.. అప్పటి నుంచి మిమ్మల్ని కాలర్ దించుకునేలా చెయ్యలేదని నటుడుగా నాకు నేను ఆనందించేలా సినిమాలు చేయాలని రియలైజ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నానని తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =